calender_icon.png 27 December, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీడిత ప్రజల పక్షాన నిలిచే పార్టీ సీపీఐ

27-12-2025 12:21:12 AM

పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి

సంస్థాన్ నారాయణపూర్, డిసెంబర్ 26(విజయ క్రాంతి): పీడిత ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ వారి హక్కుల సాధనకై కృషి చేసే ఏకైక పార్టీ సిపిఐ అని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. సిపిఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ బ్రిటిష్  సామ్రాజ్య వాధానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన పార్టీ సిపిఐ అని, ప్రపంచ చరిత్రలోనే  ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా 100 సంవత్సరాల పాటు నిలిచిన పార్టీ సిపిఐ అని అన్నారు.

పీడిత ప్రజల పక్షాన ఎన్నో సమస్యల పోరాటాలు నిర్వహించి దేశ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిపిఐ పార్టీ పోరాటంతోనే మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించామని అన్నారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం  ఆ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ పార్టీ తరఫున సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లుగా గెలుపొందిన వారిని మండల శాఖ ఆధ్వర్యంలో   సన్మానించారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాలు అభివృద్ధి పథంలో నడిచేలా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగోని గాలయ్య,ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కే శ్రీనివాస్,  మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, జిల్లా నాయకులు ఎండి ఇమ్రాన్, చిలువేరు అంజయ్య, కలకొండ సంజీవ,సర్పంచ్ లు ముత్యాల అంజయ్య, కురిమిద్దే వినోద, ఉప సర్పంచ్లు పల్లె మల్లారెడ్డి, రావుల ప్రశాంత్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.