calender_icon.png 27 December, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసేవకు అంకితం అవుతాం

27-12-2025 02:18:42 AM

  1. ఈసారి గెలుపొందిన సర్పంచుల్లో 40% మేధావులే

మహిళా సర్పంచులే 193 మంది

సర్పంచ్ పదవిలో సగం మంది  యువ నాయకత్వమే

నిర్మల్ , డిసెంబర్ ౨౬ (విజయక్రాంతి): దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే. పల్లె అభివృద్ధి చెందితే దేశం చెందుతుంది. అటువంటి పల్లెపాలనపై మేధావులు యువకులు స్థానిక సంస్థ ల ఎన్నికల్లో సర్పంచులుగా ఎన్నికయ్యారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో పాలనలో మార్పు తెచ్చి ప్రజాసేవకు అంకితం అయ్యేందుకు యువత మేధావులు ఎన్నికల బరిలో విజయం సాధించి పల్లె పాలనపై దృష్టి పెట్టనున్నారు.

నిర్మల్ జిల్లాలో మొత్తం 18 మండల పరిధిలో 400 గ్రామపంచాయతీ ఉండగా 399 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఈనెల 11,14,17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త సర్పంచ్లను ఎన్నుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అట్టడుగు స్థాయి అయినా గ్రామ పం చాయతీ ఎన్నికల్లో ప్రజలకు చేరువగా ఉండి పాలనపై పట్టు సాధించే విధంగా ప్రజా సేవే లక్ష్యంగా నిర్మల్ జిల్లాలో ఈసారి జరిగిన ఎన్నికల్లో 35 సంవత్సరాల లోపు గెలుపొందిన సర్పంచులే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 400 సర్పంచులకు గాను 193 సర్పంచులు మహిళలే కావడం విశేషం

ప్రజా సేవే లక్ష్యంగా మేధావులు

నిర్మల్ జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవి కోసం యువతి యువకులు కోటి పడగా అందులో ఎక్కువగా విద్యావంతులు మేధావులే విజేతలుగా నిలిచారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయా గ్రామాల్లో యువతీ యువకులు పోటీ చేసేందుకు మొదటినుంచి ఆసక్తి చూపగా అందులో ఆ గ్రామం లో యువకులందరూ విద్యావంతులు రెండేళ్లు గా ప్రజాసేవ చేస్తున్న యువకులను సర్పంచ్ అభ్యర్థులుగా ఎంపిక చేసి వారిని గెలిపించుకునే బాధ్యతలు యువతరం చేపట్టింది.

గెలు పొందిన సర్పంచుల్లో ఎస్సీ ఎస్టీ మార్మూల తండాలో కొంత విద్యావంతులు తక్కువగా ఉన్నప్పటికీ బీసీ జనరల్ స్థానాల్లో లాయర్లు ఎంఎస్సీ బీడీ చేసే వాళ్ళు డిగ్రీ పూర్తి చేసిన వారు ఇంటర్ పూర్తి చేసిన వారు సాఫ్ట్వేర్లు ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన వ్యాపారులు ఉన్నారు.

గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదని ఈసారి సర్పంచ్ ఎన్నికలు మేధావులు విద్యావత్తులు చట్టాలను తెలుసుకున్నవారు సమాజ సేవ చేసేవారు సర్పంచ్ గా ఎన్నిక కావడంతో ప్రజా పాలనలో మార్పు వచ్చి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకత పాలన గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జిల్లా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఆ గ్రామంలో ఏళ్ల తరబడి సర్పంచులు ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇతర రాజకీయ పదవులు అనుభవించిన వారు ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసినప్పటికీ చాలాచోట్ల వారు ఓటమి చెంది కొత్త నాయకత్వాన్ని గ్రామ ప్రజలు మార్పు కోసం కోరుకున్నట్టు గెలుపొందిన సర్పంచులను చూస్తే తెలుస్తుంది.

ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ తో పాటు అక్కడి జనాభాను బట్టి ఉపసర్పంచ్ 14 వరకు వార్డు మెంబర్లు పదవులు పొందగా వీరిలో 80% చదువుకున్న యువతీ యువకులకు ఉన్నట్టు తెలుస్తుంది మహిళా సర్పంచులు గా గెలిచిన వారిలో కూడా ఎక్కువగా ఇంటర్ డిగ్రీ ఉన్నత చదువులు చదివిన వారు ఈసారి ఎక్కువగానే ఉన్నారు.

విద్యావంతులు సర్పంచ్‌గా గెలిచారు

నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఎక్కువగా సర్పంచులు వార్డ్ మెంబర్లు చదువుకున్న వారు ఎక్కువగా గెలవడం పల్లె పాలనలపై మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.గెలిచిన వారిలో సగం మంది మహిళలు కావడం అందులో యువతరం ఎక్కువగా ఉండటంతో కష్టపడి పనిచేసే మనస్తత్వం ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి అవకాశం ఉంది. 

శ్రీనివాస్, డీపీఓ నిర్మల్

పాలనలో మార్పు తెస్తాం

పల్లె పనులను మార్పులు తెచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను సర్పం చ్ బరిలోకి దిగి ప్రజల ఆధార అభిమానులతో విజయం సాధించిన. హైకోర్టులో లాయర్‌గా పనిచేస్తూనే రెండేళ్లుగా కుంటాలలో ప్రజలతో మమేకమై సేవ చేసిన ఆ సేవనే తనను సర్పంచ్ చేసింది.నాకు పంచాయతీరాజ్ చట్టం ప్రజా పాలనపై పట్టు ఉంది కచ్చితంగా ఐదేళ్లలో ప్రజా సేవ చేసి ప్రజల మెప్పు పొందుతా.

జక్కుల గజేందర్, సర్పంచ్ కుంటాల