30-08-2025 09:17:44 PM
ఉద్యోగులు ఉపాధ్యాయుల ధర్నాలు విజయవంతం చేయాలి
మునుగోడు (విజయక్రాంతి): సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గేర నరసింహ, ప్రధానోపాధ్యాయులు తాటి శ్రీనివాసులు అన్నారు. శనివారం మండలంలోని పలివెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విడుదల చేసి మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా, పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునర్కరించాలని సెప్టెంబర్ 1న పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉపాధ్యాయులు హాజరై ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, వెంకటేశ్వర్లు, విలియం రాజు, బాలరాజు, లింగమ్మ, వెంకన్న, రాఘవేందర్, మహేష్, కవిత, సావిత్రి , ప్రవళిక ఉన్నారు.