30-08-2025 09:19:47 PM
ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం/దుమ్ముగూడెం (విజయక్రాంతి): గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు పాఠ్యాంశాల లోని బేసిక్స్ సులభంగా నేర్చుకునేందుకు వీలుగా బోధనా పద్ధతులకు ఉపయోగపడటానికి టిఎల్ఎం మేళ ద్వారా ఉపాధ్యాయుల ప్రతిభకు దిక్సూచిగా పనిచేస్తాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. శనివారం దుమ్ముగూడెం మండలం రేగుబల్లి-2 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన టిఎల్ఎం మేళాను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయులు వివిధ రకాల ఆకృతులతో తయారుచేసిన చిత్రాలను ఆయన పరిశీలించిన అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భద్రాచలం డివిజన్ పరిధిలోని 81 పాఠశాలలో పనిచేయుచున్న 101 మంది టీచర్లు వివిధ రకాల ఆకృతులతో తెలుగు, గణితం, ఇంగ్లీష్ సంబంధించిన చిత్రాలు విద్యార్థులకు బేసిక్స్ సులభమైన పద్ధతిలో అర్థం చేసుకునే విధంగా తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు రూపొందించిన సృజనాత్మక బోధన అభ్యాస సామాగ్రి ఈ మేళా యందు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచిందని, విద్యార్థినీ విద్యార్థులు వివిధ అంశాలను నేర్చుకునే వీలుగా రూపొందించిన అభ్యాసన పద్ధతులు సులభమైన రీతిలో అర్థమయ్యేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ఇలాంటి మేలాల ద్వారా ఉపాధ్యాయులలో దాగివున్న ప్రతిభా పాటవాలను వెలికితీయడమే కాకుండా నూతన అంశాలు విద్యార్థులకు తెలిసే విధంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు నెగ్గుకు రావాలంటే అధునాతనమైన ప్రతి అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం మూడు డివిజన్లలో ఇటువంటి మేళాలు నిర్వహిస్తున్నామని మూడు డివిజన్లో ఉత్తమంగా ఎంపికైన సృజనాత్మక చిత్రాలను వచ్చే నెల 9వ తారీఖు నాడు ఐటీడీఏ లెవెల్లో టిఎల్ఎం మేల నిర్వహించి ఉత్తమమైన చిత్రాలను ఎంపిక చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏసీఎంవో రమేష్, ఏ టి డి వో అశోక్ కుమార్, పాఠశాల హెచ్ఎం సావిత్రి వివిధ పాఠశాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.