calender_icon.png 6 May, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోషులను కఠినంగా శిక్షించాలి

06-05-2025 01:18:45 AM

సబ్ రిజిస్ట్రార్‌పై దాడిని ఖండించిన టీఎన్జీవో, టీజీవో సంఘాలు

హైదరాబాద్, మే 5 (విజయక్రాం తి): విధి నిర్వహణలో ఉన్న పెద్ద అంబర్‌పేట్ సబ్ రిజిస్ట్రార్ ఎల్. రవీందర్ పైన జరిగిన దాడిని టీఎన్జీవో, టీజీవో సంఘాలు ఖండించాయి. ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. సబ్ రిజిస్ట్రార్‌పై శ్రీనివా స్ యాదవ్ సహా తదితరులు దుర్భాషలాడుతూ పాశవికంగా దాడి చేసి అగౌరవపరిచిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

వాళ్లకు ఏవై నా అభ్యంతరా లుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా దాడులు చేయడం సరికాదన్నారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్.ఎం.హుస్సేని, ముజీబ్‌లు.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్‌మెంట్ అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ వెంకట రాజేష్‌కు  ఫిర్యాదు అందిం చారు.