06-05-2025 01:19:15 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, మే 5 (విజయక్రాంతి): ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 48 అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 29, జిల్లా పంచాయతీ శాఖ 8, సర్వే ల్యాండ్స్ 3, హౌసింగ్ 2, ఆర్.టి.సి 2, లేబర్, విద్య శాఖ, ఇంటర్మీడియట్ , జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ... పభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం వంటి సంక్షేమ పథకాలను మండల స్పెషల్ అధికారులు.
గ్రామాలలో తిరిగి అరులైన లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కోసం బేస్మెంట్ పూర్తి అయితే ప్రభుత్వం మీ తదుపరి కట్టుబడికి లక్ష రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తుందని , ఆ తదుపరి 2 లక్షలు జమ చేస్తుందని తెలియజేసి ప్రతి ఒక్క పేద కుటుంబం ఇళ్ళు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, కలెక్టరేట్ ఏ ఓ జగన్మోహన్ ప్రసాద్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.