calender_icon.png 8 January, 2026 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రజెండా ముద్దుబిడ్డ పోటు ప్రసాద్ మరణం సీపీఐకి తీరని లోటు

05-01-2026 01:40:04 AM

సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ 

గరిడేపల్లి, జనవరి 4 : అమరుడా నీ మరణం మరువలేనిది ప్రజల కోసం పనిచేసే నాయకులు చనిపోయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారని సిపిఐ జాతీయ నాయకులు, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామంలో దివంగత సిపిఐ నాయకులు పోటు ప్రసాద్ స్థూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం పాటుపడే ప్రతి నాయకుడు చరిత్రలో నిలిచిపోతారని, అటువంటి నాయకుడిని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని తెలిపారు.

దేశంలో కమ్యూనిజం లేకుండా చేస్తామని మోడీ, అమిత్ షా ద్వయం బీరాలు పలుకుతున్నారని, కమ్యూనిజాన్ని అంత మొందించడం అంత సులువు కాదని ఆయన హితవు పలికారు. దేశంలోని పౌరులు అనుభవిస్తున్న అన్ని సౌకర్యాలతో పాటు బడుగు బలహీన వర్గాల సమస్యలు పరిష్కారం అయ్యాయి అంటే అందుకు కారణం కమ్యూనిస్టులే అని, వారు చేసిన పోరాట ఫలితాలతోనే పాలకులు దిగివచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కోణంనేని సాంబశివరావు మాట్లాడుతూ  వెనుజులా దేశంపై అమెరికా చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

అమెరికా దేశం నేడు ఒక ప్రపంచ నియంతగా ప్రవర్తిస్తుందని ప్రతినిత్యం ప్రపంచంలోని ఏదో ఒక దేశంతో కయ్యాలు పెట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అశాంతిని నెలకుతుందని ఆయన ఆరోపించారు. అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ అనేవాడు నేడు ప్రపంచానికి కంపుగా మారాడని, ఆ దేశం అనుసరిస్తున్న విధానాలను ప్రపంచంలోని అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని కోరారు. మొదట స్తూపాన్ని ఆవిష్కరించిన అనంతరం పోటు ప్రసాద్కు ఘనంగా నివాళులు అర్పించారు.

జిల్లా సిపిఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఆది శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఐ, సిపిఎం ఖమ్మం జిల్లాల కార్యదర్శి దండి సురేష్, నున్న రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ధనంజయ నాయుడు, ఎల్లావుల రాములు, ఉస్తేల నారాయణరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు, ఉస్తేల సృజన, కంబాల శ్రీనివాస్, దేవారం మల్లీశ్వరి, గుండు వెంకటేశ్వర్లు, నంద్యాల రామ్ రెడ్డి, సాయిబెల్లి, పోర్టు కళావతి, పోటు చింటూ బాబు, కృష్ణ బాబు, మండల సిపిఐ కార్యదర్శి కడియాల అప్పయ్య,రంగాపురం, గానుగ పంట సర్పంచులు కట్ట కళ్యాణి, కడియాల పద్మ, పోటు పూర్ణచంద్రరావు, అమరారపు పున్నయ్య, చిల్లంచర్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.