calender_icon.png 24 December, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాఖలు సమన్వయంతో పనిచేయాలి

24-12-2025 01:29:37 AM

జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్

రంగారెడ్డి, డిసెంబర్ 23(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అవగాహన తోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని జిల్లా అదనపు కలెక్టర్  శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీకమిటీ మీటింగ్ నిర్వహించారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రత చర్యలు అనే అంశంపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు.

పవర్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాలు అధికంగా అవుతున్న ప్రాంతాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.  ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీస్ మున్సిపల్ నేషనల్ హైవే ఆర్ అండ్ బి ఆర్ టి సి అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు.

ఇందులో ప్రజలు కూడా సహకరించాలన్నారు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డిఫెన్సివ్ డ్రైవింగ్ తారకమంత్రమని, పరిసరాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో వాటి నియంత్రణకు భద్రత చర్యలు చేపడతామన్నారు. ఇందుకు అవసరమైన చోట ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సంవత్సరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలనీ, అందుకు అవసరమైన పనులు చేపట్టేందుకు అనుమతిస్తామని  పేర్కొన్నారు. మొత్తానికి రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా రంగారెడ్డి జిల్లాను అధికారులంతా సమిష్టిగా తీర్చిదిద్దాలని సూచించారు..

ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం అతివేగం నిర్లక్ష్యంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయడమేనని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని పని చేసేలా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎక్కడ ఏం అవసరం ఉన్నా అధికారులు భద్రత చర్యలు చేపట్టాలన్నారు. కళాశాల విద్యార్థులు స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని, ఎవరైనా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

అదే విధంగా అనుమతించబడిన వేగం వరకే వాహనాలు నడపాలని అతివేగంగా, రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపి  ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. సమావేశంలో ఆర్ అండ్ బి, ట్రాన్స్పోర్ట్, నేషనల్ హై వే, పోలీస్, ట్రాఫిక్, ఆర్టీసీ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.