calender_icon.png 19 August, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

19-08-2025 12:09:58 AM

 నాగారం ఆగస్టు 18 : త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని నాగారం మండలం నర్సింహులగూడెం  గ్రామస్తులు సోమవారం కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి వచ్చే త్రాగునీటి బోరు చెరువు ఆవరణలో ఉండడం వలన ఇటీవలే కురిసిన వర్షానికి చెరువు నిండి చెరువు ఆవరణలో ఉన్నటువంటి బోరులోకి మురికి నీరు వస్తుండడంతో నీరంతా మురికగా అయ్యాయని గ్రామస్తులు తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారని మురికి నీరు ఎలా తాగాలని, వ్యవసాయ మోటార్ల వద్ద తాగునీరు తెచ్చుకుంటూ కాలంగడుపుతు న్నామని కానీ ఇటీవలే కురుస్తున్న వర్షాలకు తాగునీరు కోసం వచ్చిన వారు ఎక్కడ విద్యుత్ షాక్ కు గురవుతారో  రైతులు మోటార్ లను బంద్ చేశారని అన్నారు.ప్రతి సంవత్సరం చెరువు నిండితే ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు..ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పొర్ల పెద్దిరాజు , చెన్నబోయిన సైదులు, మల్లేష్,చారి, తదితరులు పాల్గొన్నారు.