26-08-2025 02:13:58 AM
- ఓడేన్న చెరువు శిఖం లేదంటున్న అధికారులు
- 30 ఏళ్లుగా రుసుం ఎలా వసూలు చేశారని మత్స్యకారుల ప్రశ్న
- న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు
మహబూబ్ నగర్ ఆగస్టు 25 (విజయ క్రాంతి) : దశాబ్దాల తరబడి చెరువు పై జీవనోపాధి పొందుతూ కాలం వెళ్లదీస్తున్నాం. కోయిలకొండ మండలం అంకిళ్ల గ్రామ పరిధిలోని ఓడేన్న చెరువును నమ్ముకుని దాదా పు 400 మంది మత్స్యకారులం ఆధారపడి ఉన్నాము.. అప్పటి ప్రభుత్వము రాతపూర్వకంగా చెరువు భూభాగం అంటూ పత్రం ఇ చ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా చెరువుకు సంబంధించిన రకం (రుసుం) చెల్లిస్తూ వస్తున్నాం.
ప్రభుత్వం పంపిణీ చే స్తున్న చేప పిల్లలను సైతం విడుస్తున్నాం... ఇప్పుడు ఉన్నట్టుండి ఈ చెరువు శిఖం లేదు అని చెప్పడం వెనుక ఉన్న అంతరిమేమిటని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కి అంకిళ్ల మత్స్యకారులు తర్వాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు నాటి నుంచి నేటి వరకు వారు ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నులకు సం బంధించి పత్రాలను సమర్పించారు. చెరువు ల భూములపై కన్ను వేసిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు చెరువులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మత్స్య కారులు అధికారుల దగ్గర విన్నవిస్తుండ్రు.
- తగుతున్న చెరువులు...కుంటలు
నాడు ఉన్న చెరువులు కుంటలను పరిగణలోకి తీసుకుంటే రోజురోజుకు వీటి సంఖ్య తగ్గుముఖం పడుతుంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అయితే అసలు చెరువులు కుం టలు ఇక్కడ ఉన్నాయా ? ఉంటే ఎక్కడున్నా యి ? చెరువులను కుంటలను గుర్తించి వా టిని యధాస్థితిలో ఉంచవలసిన అధికార యంత్రాంగం అటువైపు చూడడమే మానేసి న్రు.
పత్రికల్లో ఇక్కడ చెరువు ఉండే అక్కడ చెరువు కబ్జా అవుతుంది అంటూ కథనాలు వెలువడిది తప్ప అటువైపు సంబంధిత అధికార యంత్రం చూడడం మానేసింది. సాక్షాత్తు కోయిలకొండ మండల పరిధిలోని అంకిళ్ల గ్రామంలో చెరువు భూమికి సంబంధించి శిఖం రద్దు చేయడం ఎంతవరకు స మంజసం. కాపాడాల్సిన అధికారులే మీ చె రువుకు శిఖం లేదు అంటే మరి నాటి నుంచి ఎందుకు రకాలు వివిధ పనులను తీసుకున్నారు వారే చెప్పాలి.
ఆ శాఖ ఉన్నది ఎందుకు..?
భూగర్భ జలాలు అట్టడుగు పోకుండా చెరువులు కుంటలు ఎల్లప్పుడూ నీరు పుష్కలంగా ఉంటే ఎంతో తోడ్పాటును అంది స్తాయి. అలాంటిది ప్రస్తుతము పట్టణ ప్రాం తాలలో చెరువులు కుంటలు కబ్జాలకు గురి అవుతున్నాయి. శిఖం భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రం అటువైపు చూడడమే మానే సి ఎవరో చెబితే తప్ప ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
ఎందుకు అంటే ఇందుకు ఎన్నో కారణాలు చెబుతారు. అప్పుడు అట్లా ఉండే ఇప్పుడు ఇట్లా ఉంది ఆ పేపర్ దొరకడం లేదు చెరువు భూమి ఇంత లేదు అంత లేదు అంటూ తప్పించుకునే సమాధానాలు చెబుతూ చెరువులు కుంటలు కనుమరుగయ్యేలా కొంతమంది అధికారులు సహకా రం అందిస్తున్నారు. సంబంధిత అధికారులు నియంత్రించాల్సి ఉన్నప్పటికీ ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు.
చెరువులను, కుంటలను కాపాడాలి..
కోయిలకొండ మండలం అంకిళ్ల గ్రామంలో ఓడేన్న చెరువు శిఖం మూడు దశాబ్దాల క్రితం నాటి నుంచి ఉంది . నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎందుకు సాక్ష్యం.
ఇప్పుడు ఈ చెరువుకు శిఖరం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం. పూర్తిస్థాయిలో విచారణ చేసి తప్పిదాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. చెరువు లేకుం టే నాటి నుంచి పన్నులు ఎందుకు చెల్లిస్తారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తమ ప్రయత్నం ఆగదు.
గంజి ఆంజనేయులు, జిల్లా మత్స్యకార సహకార సంఘం చీప్ ప్రమోటర్, మహబూబ్ నగర్ జిల్లా