calender_icon.png 26 August, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డును పూడ్చిన వ్యక్తికి నోటీసులు

26-08-2025 02:11:59 AM

గోపాలపేట ఆగస్టు 25: ప్రభుత్వ డం పింగ్ యార్డును మట్టితో పూడ్చిన సంఘటనలో పీఠ్యా నాయక్ అనే వ్యక్తి కి నోటీసులు జారీ చేసిన గోపాలపేట ఎంపీడీఓ భవాని. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బు ద్దారం లక్ష్మీ తండా గ్రామం పంచాయతీ లో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు నిర్మాణం కోసం 590 సర్వే నెంబర్ లోని భూమిని తహసీల్దార్ కేటాయించడం జరిగిందని ఎంపీడీఓ అన్నారు..ప్రభుత్వ గ్రా మ పంచాయతీ ఆస్తి అయిన డంపింగ్ యా ర్డును ప్రభుత్వ సెలవు దినంలో ఆదివారం రోజు డంపింగ్ యార్డును అన్యకాంతం చే స్తూ,ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని దుర్వినియోగం చేస్తూ ప్రజా ధనం వెచ్చించి నిర్మాణం చేసిన దానిని పీఠ్యా నాయక్ పూడ్చి వేశారన్నారు.

ఇట్టి ఆస్తిని దుర్వినియోగం చేసి మట్టితో పూ డ్చిన అతనికి నోటీసులు ఇచ్చామని త్వరలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రా మాలు, తండాలు గ్రామ పంచాయతీలు పరిశుభ్రతతో ఉండాలంటే చెత్త చెదారం లే కుండా చూడాలి. గ్రామంలో ఇళ్లిళ్ళు తిరిగి గ్రామ కార్మికులు చెత్తను సేకరించి ట్రాక్టర్ లో వేసుకొని డంపింగ్ యార్డులో వేస్తారు.. తండాలో పరిశుభ్రంగా ఉంచి కార్మికులు శ్రమిస్తుంటే డంపింగ్ యార్డు ను పూడ్చడం సరైన పద్దతి కాదని అన్నారు.

ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన లక్ష్మీ తండా యువకులు

సోమవారం ప్రజావాణిలో వనపర్తి జిల్లా కలెక్టర్ కు బుద్దారం లక్ష్మీ తండా యువకులంతా కలసి ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు. తండాలో తన ఇష్టా రా జ్యంతో పీఠ్యా నాయక్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి సెలవు దినాలలో మట్టిని పూ డ్చి వేశారన్నారు.అధికారులకు సైతం సమాచారం ఇవ్వకుండా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని తిరిగి డంపింగ్ యార్డును పునరుద్దరించాలన్నారు.