calender_icon.png 23 August, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుమేహంతో మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్

23-08-2025 01:20:17 AM

  1. డయాబెటిస్  వైద్యసేవలపై సదస్సు
  2. పాల్గొన్న ఆలివ్ సర్వోదయ హాస్పిటల్ వైద్యులు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 22 (విజయక్రాంతి): డయాబెటిస్ సంరక్షణ అత్యంత సవాలుతో కూడినదని, దీని ప్రభా వం మానసిక ఆరోగ్యంపై ఉంటుందని ఆలివ్ సర్వోదయ హాస్పిటల్ వైద్య నిపుణులు తెలిపారు. మానసిక ఆరోగ్యంతో మధుమేహ వ్యాధి-కి ఉన్న సంబం ధంపై ఆరోగ్య సమాచార సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆలివ్ సర్వోదయ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు.

ఈ సదస్సుకు కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ వికాసుద్దీన్ సారథ్యం వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ డయాబెటిస్ నిర్వహణ రక్తం లో చక్కెర స్థాయిలను నియంత్రించడం, ఔషధ షెడ్యూల్‌ను అనుసరించడం వరకే పరిమి తం కాదన్నారు. మానసిక ఆరోగ్యాన్ని శారీరక లక్షణాలతో సమానమైన తీవ్రతతో చూ డాలని నొక్కి చెప్పారు. గ్లూకోస్‌ను నియంత్రించడం ద్వారా బాధితులు సంతప్తికరమైన జీవితాన్ని పొందుతారని పేర్కొన్నారు.

100 మిలియన్లకు పైబడి

దేశంలో ప్రస్తుతం 100 మిలియన్ల డయాబెటీస్ బాధితులు ఉన్నారని ఆయన చెప్పారు. ప్రతి నలుగురు డయాబెటిస్ రోగులలో ఒకరు ఆందోళన లేదా డిప్రెషన్ రూపంలో మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొననారు.

పట్టణీకరణ, అధిక పనిసమయం, తక్కువ శారీరక శ్రమ, ఒంటరి తనం ఈ సమస్యలను మరింత తీవత్రరం చేస్తున్నా యని వైద్యులు తెలిపారు. ఆధునిక వైద్యంలో డయాబెటిస్ సంరక్షణ, మానసిక ఆరోగ్య నిపుణులు, కుటుంబం పాత్ర, ఆరోగ్య సంరక్షకుల సమన్వయం కూడా అవసరమని డాక్టర్ వికాసుద్దీన్ స్పష్టం చేశారు.

ఆలివ్ హాస్పిటల్‌లో ఆధునిక వైద్యం

తెలంగాణలో ఆలివ్ హాస్పిటల్స్ అధునాతన వైద్య సంరక్షణకు దారిచూపాయి, సమ గ్ర ఆరోగ్య సంరక్షణ, నాణ్యత పట్ల నిబద్ధతతో 2010 నుంచి ఆలివ్ హాస్పిటల్  అంద రికీ వైద్యం అనే ఒకే లక్ష్యంతో  పనిచేస్తున్నది. ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నది.

15 సంవత్సరాల క్రితం ప్రారంభమై రోగి సంరక్షణలో అత్యుత్తమ ప్రతిభతో ఆలి వ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారిం ది. 210 పడకల అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్ సౌకర్యం, వివిధ స్పెషాలిటీలలో విస్తృతశ్రేణి వైద్యసేవలను ఆలివ్ హాస్పిటల్ అందిస్తోంది.

కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం వహిం చింది. జాయింట్ రీప్లేస్‌మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డయాగ్నస్టిక్స్, ఇంటర్వెన్షనల్ సర్వీసెస్‌ను అందిస్తోంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, సమర్థులైన వైద్యులను నియ మించుకోవడంతో ఆలివ్ హాస్పిటల్‌కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ హె ల్త్‌కేర్ నుంచి జాతీయ గుర్తింపు లభించింది.