calender_icon.png 23 August, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి

23-08-2025 01:19:54 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల 

ఖైరతాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి) : అన్ని రాజకీయ పార్టీలు బిసిలను మోసం చేస్తున్నాయని బిసి సంక్షేమ సంఘా జాతీ య అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించిన బిల్లులపై ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని మండిపడ్డారు.

శుక్రవారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 42 శాతం బిసి రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తూ తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కమిటీ అధ్యక్షులు బత్తుల చంద్రం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో చట్టం చేసిన బిసి బిల్లును, స్థానిక సంస్థల ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించకుండా కేంద్రం సుప్రీంకోర్టును అగౌరవపరిచిందన్నారు.

రాజ్యాంగం ప్రకారం, జనాభా ప్రకారం వాటా దక్కాలంటున్న రాహుల్ గాంధీ, బిసి ప్రధాని అని చెప్పుకొనే మోదీ బిసి రిజర్వేషన్ల బిల్లులపై పార్లమెంట్లో మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీకి బిసి రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే  ఇండియా కూటమి ఎంపిలతో మోదీ ఇంటి ముందు దర్నా చేయాలని డిమాండ్ చేశా రు. దళిత సంఘాల ఐకాస బిసి రిజర్వేషన్ల సాధనకు మద్దతు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 10శాతం ఉన్నఅగ్రవర్ణాల పాలనకు 90శాతం ఉన్న బహుజనులంతా ఫుల్ స్టాఫ్ పెట్టాలని, ఇందుకు ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐకాస నేతలు వనం రమేశ్ సునీల్, కూతాడి రవికుమార్, సదానందం. బాస్కరచారి, బిసి నేత జాజుల లింగం గౌడ్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.