17-10-2025 12:00:00 AM
బిచ్కుంద, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు లేవని, ప్రతిపక్ష పార్టీ వారు జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధిని జీర్ణించుకోలేక ఏదో ఒకటి సృష్టించి పేపర్లలో రాయిస్తున్నారని పిసిసి డెలికేట్ విట్టల్ రెడ్డి అన్నారు. బిచ్కుంద పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
ఓ దినపత్రికలో వచ్చిన కథనం స్థానిక శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని పార్టీని వీడి పదవులకు రాజీనామాలు చేస్తున్నారని అసత్యపు ఆరోపణ లు చేశారని వారు తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు కలిసికట్టుగా ఉన్నారని తప్పుడు ఆరోపణలు అబద్దమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ లోని క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తున్నారని వారు అన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి తమ సత్తా చాటుతామన్నారు.