06-01-2026 12:00:00 AM
కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ, జనవరి 5 (విజయక్రాంతి): నీట్ పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నీట్ పరీక్షలు- 2026 నిర్వాహణ పై సమన్వయ సమావేశం డిసిపి రాజమహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరీక్షల ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు.
ఈ పరీక్షకై జిల్లాలో 2 సెంటర్లు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ ను కేటాయించగా అందులో మొత్తం సుమారు 650 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. మే -2026 సంవత్సరంలో నీట్ పరీక్షలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు సత్యమూర్తి, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.