calender_icon.png 9 January, 2026 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాక్టీరియాతోనే రంగు మారాయి!

06-01-2026 12:00:00 AM

  1. క్లోరిన్ వేస్తే తెలుపుగా మారుతాయి
  2. పింక్ నీళ్లతో పొలాలకు, పశువులకు నష్టం లేదు
  3. హెటిరో పరిశ్రమ డైరెక్టర్ సాంబిరెడ్డి వెల్లడి

గుమ్మడిదల, జనవరి 5: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు నల్లకుం ట చెరువు నీళ్లు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా వల్ల పింక్ కలర్‌గా మారుతున్నాయని హెటి రో పరిశ్రమ యూనిట్ వన్ డైరెక్టర్ సాంబిరెడ్డి ఐఐటి ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా సోమ వారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దోమడుగు నల్లకుంట చెరువు పింక్ నీళ్లుగా మారడానికి గల కారణం పరిశ్రమ కాదని, చెరువు నీళ్లు ఎప్పటికీ నిల్వ ఉండటం వల్ల పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఏర్పడి అవి పింకు నీళ్లుగా మారుతాయని తెలిపారు.

వా టిని తెలుపు రంగులోకి మార్చడానికి క్లోరిన్ సరిపోతుందని, దీనివల్ల పంట పొలాలకు, పశువులకు, మనుషులకు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపారు. పీసీబి అధికారుల సూచనల మేరకు పరిశ్రమ నల్లకుంటపై చర్యలు తీసుకుంటుందని, గ్రామ ప్రజలు పరిశ్రమను మూసివేయాలని నినాదాలు చేయడం సబబు కాదని తెలిపారు. పరిశ్రమ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా ఉండదని, పరిశ్రమ వల్ల అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని చెప్పారు.

పరిశ్రమ నుండి రైతులకు ఎటువంటి నష్టం కావడం లేదని, సంవత్సరానికి రెండు పంట లు పండిస్తున్నారని, అయినప్పటికీ గత 12 సంవత్సరాల నుండి ఎకరా చొప్పున 20వేల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. ఎవరికై నా నష్టం జరుగుతుంది అంటే పరిశ్రమ వారికి అండగా ఉంటుందని, గ్రామ ప్రజలు సమస్య పరిష్కార దిశగా ఆలోచన చేయాలని సూచించారు. గ్రామ పెద్దలు ప్రజలు సానుకూలంగా స్పందించి గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడు సిఎస్‌ఆర్ నిధులతో సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.

గ్రా మ అభివృద్ధి కోసం ఇంకేమైనా సమస్యలున్నప్పటికీ తమ దృష్టికి తీసుకువస్తే వాటిని సానుకూలంగా స్పందించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామన్నారు. పాడి గేదెలు మృత్యువాత పడటానికి ప్రస్తుతం దాబాలలో, హోటళ్లలో రబ్బిస్ లాంటి వ్యర్ధాలను పెట్టడం వల్ల  దాంతోపాటు పాలు పితుక్కోవడానికి నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇ వ్వడం వల్ల పాడి గేదెలు మృత్యువాత ప డుతున్నాయని తెలిపారు. గతంలో మండలం లోని పశువైద్యాధికారునికి కూడా సూ చించామని తెలిపారు. పరిశ్రమ ముఖ్య సలహా దారులు రామ్మోహన్ రెడ్డి,  ఎన్విరాన్మెం ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగరాజు, హెచ్‌ఆర్ మేనేజర్ ఉమామహేశ్వర్ రెడ్డి ఉన్నారు.