calender_icon.png 9 January, 2026 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి

06-01-2026 12:00:00 AM

గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ వెంకట్రామయ్య 

జిన్నారం/అమీన్ పూర్, జనవరి 5 : గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం 18 వార్డుల  ఓటర్ల డ్రాఫ్ట్ రోల్  పబ్లికేషన్ జాబితా పైన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో  సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఓటర్ల జాబితాలో వార్డులలోని ఓటర్లకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అర్హత కలిగిన దరఖాస్తులను పరిశీలించి సవరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజన, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు ఆఫీసర్స్ భవాని, నవీన్, అనుపమ, మున్సిపల్ అధికారులు, అన్నీ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికలకు అందరూ సహకరించాలి..కమిషనర్ సత్య ప్రణవ్

జహీరాబాద్ టౌన్, జనవరి 5 : జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రజలు సహకరించాలని జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, తహసిల్దార్ దశరథ్ సోమవారం వివిధ పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

గతంలో కంటే వార్డుల సంఖ్య పెరగడం వల్ల ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సమాయత్తంగా ఉందామని  అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిపిఐ  నర్సింలు కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖండెం నరసింహులు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నామ రవికిరణ్,  బిజెపి పూల సంతోష్, ఆయా పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.