13-01-2026 01:19:55 AM
కలెక్టర్ రాజర్షి షా...
వయోవృద్ధుల అనుభవాలు భావితరాలకు మార్గదర్శకం
ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్వామి వివేకానందల సూచనల మేరకు ప్రతి యువకుడు తమ తల్లిదండ్రులను, వయోవృద్ధులను అప్యాయంగా చూసుకోవాలని, వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షాపేర్కొన్నారు. ప్రణామ్ సేవలను వయోవృద్ధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకో వాలని కోరారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ క్వార్టర్స్ లైన్లో ఏర్పాటు చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బాల బరోసా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రణామ్ డే కేర్ సెంటర్ను పరిశీలించి, వయోవృద్ధులతో కాసేపు క్రీడల్లో పాల్గొని వారిలో ఒకరిగా మమేకమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో వయోవృద్ధుల సం క్షేమం కోసం ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని ఇటీవల వృద్ధు ల కోసం ఒక ఆశ్రమాన్ని కూడా ప్రారంభించామని తెలిపారు. వయోవృద్ధుల రక్షణ చట్టం ప్రకారం వారి సమస్యల పరిష్కారానికి ఆర్డీవో స్థాయిలో ట్రిబ్యునల్స్, కలెక్టర్ స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్స్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. సీనియర్ సిటిజన్స్, పెన్షనర్ల సమ స్యల పరిష్కారం, వారికి ఆసరా కల్పించేందు కు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల పాత్ర ఎంతో కీలకమని, వారి అనుభవాలు భావితరాలకు మార్గదర్శకమని అన్నారు. సమాజానికి విశేష సేవలు అందిం చి, తమ జీవితాన్ని పిల్లల భవిష్యత్తు కోసం అంకితం చేసిన వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
వయోవృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందు లు, వారి మనోవేదనలను ప్రభుత్వం ప్రత్యక్షంగా గుర్తించి ప్రణామ్ డే కేర్ సెంటర్ వంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కేంద్రంలో వృద్ధుల సౌకర్యార్థం షెడ్ అవసరమని వయోవృద్ధులు కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి షెడ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఆర్డీఓ రవీందర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రతినిధులు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్, వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవిదాస్ దేశ్పాండే, ఇతర జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.
యువత సన్మార్గంలో నడువాలి: ఎమ్మెల్యే పాయల్
స్వామి వివేకనందుడు చూపిన సన్మార్గం లో యువత నడుచూకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకా నందుని జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా వివేకానం ద విగ్రహనికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. జయంతి సందర్బంగా కేక్ కట్ చేసి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. అంతకుముందు జాతీయా యువజన దినోత్సవం సందర్భంగా ఇందిరా ప్రియ దర్శిని స్టేడియం నుండి వివేకానంద చౌక్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో యువజన సంఘాల అధ్యక్షుడు బాలశంక ర్ కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రమ్మనందం, బీసీ సంఘం అధ్యక్షుడు దత్తు, అశోక్ శ్రీనివాస్ పాల్గొన్నారు.