24-01-2026 12:30:59 AM
హనుమకొండ టౌన్, జనవరి 23 (విజయక్రాంతి): హసన్ పర్తి మండలం అనంతసాగర్ లోని సుమతి రెడ్డి (ఎస్సార్) మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం శ్రీథమ్ 2కె26 కార్యక్రమాన్ని ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ. రాజశ్రీ రెడ్డి తెలిపారు.
శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీథమ్ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే ఒక అద్భుతమైన వేదిక అని సంగీతం, నృత్యం, సాహిత్యం, నాటకం, ఫ్యాషన్ వంటి వివిధ విభాగాల్లో యువత తమ ప్రతిభను ప్రదర్శింపనించేందుకు ఈ ఉత్సవం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, అంతేకాకుండా సృజనాత్మక, న్యాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక అవ గాహన పెంపొందించడంమే.
ఈ ఉత్సవ ప్రధాన లక్ష్యమని అన్నారు. అలాగే సాంప్రదాయ దినోత్సవం జరుపుతారని, విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాదరణలో పాల్గొని, పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ రీల్స్ వంటి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ ఝాన్సీ రాణి, కో- కన్వీనర్ జె. వేదిక, ఏవో జీ. వేణుగోపాల్ స్వామి, విద్యార్థులు సరయు, అర్చన, రక్షిత, శ్రీతమై, అక్షయ రెడ్డి, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.