07-01-2026 12:00:00 AM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): మున్సిపల్ ఓటర్ల ముసాయిదా జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా తుది జాబితా ప్రకటించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు..ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవిన్యూ కె. అనిల్ కుమార్, డిపిఓ హరి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, సిపిఓ శ్రీనివాస్, బిఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి మారినేని వెంకన్న, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సురేష్ నాయుడు, అజయ్, శ్యామ్, రాజమౌళి, బొమ్మ వెంకటేశ్వర్లు, ఫరీద్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.