calender_icon.png 10 November, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష టికెట్లు హాంఫట్

11-12-2024 12:10:15 AM

  • డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్టు
  • హాట్ కేకుల్లా అమ్ముడైన తొలిరోజు టికెట్లు

మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ సిరీస్‌ను వీక్షించేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. ఇప్పటికే ముగిసిన రెండు టెస్టులకు మంచి ఆదరణ దక్కింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్లు 1 సమంగా ఉన్నాయి. మూడో టెస్టు బ్రిస్బేన్ వేదికగా శనివారం (డిసెంబర్ 14 నుంచి) మొదలుకానుంది. అయితే డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. కాగా బాక్సింగ్ డే పురస్కరించుకొని  ఈ టెస్టు మ్యాచ్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

మెల్‌బోర్న్ స్టేడియం సామర్థ్యం లక్ష కాగా.. మ్యాచ్‌కు మరో 15 రోజులు సమ యం ఉన్నప్పటికీ మొదటి రోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవ్వడం విశేషం. ఈ విషయా న్ని క్రికెట్ ఆస్ట్రేలియా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పంచుకుంది. అడిలైడ్ వేదికగా ముగిసిన రెండో టెస్టుకు అభిమానులు పోటెత్తారు. మూడు రోజులు కలిపి దాదాపు లక్షకు పైగా (1,35, 012 మంది) అభిమాను లు ఈ మ్యాచ్‌ను వీక్షించినట్లు తెలిసింది.