10-07-2025 12:30:26 AM
బేల పీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే పాయల్
అదిలాబాద్, జూలై 9 (విజయక్రాంతి): నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యమని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. బేలాలో నూతనంగా ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా పి.హె.సి లోని వివిధ విభాగాల గదులను, మందుల స్టోర్ రూమ్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి షెడ్యూల్ బిజీ ఉండడం కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించలేక పోయామన్నారు. కానీ వర్షాకాలం సీజన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కల్గవద్దనే ఆలోచనతో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించామని వివరించారు.
పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితోవ పలికారు.
ఆదిలాబాద్ కు మంచి జరగాలని తన ఆలోచనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కృషితో ఇప్పటికే జిల్లాకు కార్పరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ, పేషంట్ కేర్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇంద్రజిత్, మురళీధర్, దత్తా నిక్కం, రాము, రాకేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.