calender_icon.png 10 July, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షెట్టిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

10-07-2025 12:31:34 AM

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

లక్షెట్టిపేట, జూలై 9 : మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. బుధ వారం పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పర్యవేక్షించినా అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న ప్రారంభించబోయే ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా అన్ని వైద్య సేవలు అందిస్తామన్నారు.

ఈ ప్రారంభోత్సవానికి రాష్ర్ట వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు వివిధ శాఖల మంత్రులు పాల్గొంటారన్నారు. అనంతరం దండేపల్లి మండలంలోని రెబ్బన పల్లి గ్రామ శివారులో బహిరంగ సభ ఉంటుందని, మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షుడు పెంగిలి రమేష్, ప్లొర్ లీడర్ చల్ల నాగభూషణం, డిసిసి ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, ఆర్టిఏ నెంబర్ అంకతి శ్రీనివాస్, నలిమెల రాజు, దేవేందర్ రెడ్డి, కొత్త వెంకటేశ్వర్లు, వెంకట్ స్వామి గౌడ్, రమేష్, అప్పని లింగన్న, గుండ శ్రీనివాస్, నల్లపు పోషన్న, నవాబ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.