calender_icon.png 9 January, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల హక్కుల పరిరక్షణే ‘స్మైల్ 12’ లక్ష్యం

04-01-2026 12:20:17 AM

తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు కుటుంబాలకు పునఃకలయికపై దృష్టి

శేరిలింగంపల్లి, జనవరి 3 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలల హక్కులను పరిరక్షిస్తూ వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు ‘ఆపరేషన్ స్త్మ్రల్  ౧౨’ను ప్రారంభించారు. జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా తప్పిపోయిన చిన్నారులు, వీధుల్లో జీవనం సాగి స్తున్న పిల్లలు, భిక్షాటనకు బలవుతున్న బాలలు, చెత్త సేకరణ, హోటళ్లు, నిర్మాణ ప్రాంతాలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న బాల కార్మికులు, అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీలో చిక్కుకున్న పిల్లలను గుర్తించి రక్షించడంతో పాటు వారి హక్కులు దెబ్బతిన కుండా చర్యలు తీసుకోవడమే ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం మాట్లాడుతూ బాలల రక్షణలో పోలీసులతో పాటు సమాజం, ప్రభుత్వ శాఖల బాధ్యత కూడా కీలకమని పేర్కొంటూ ఈ ఆపరేషన్ను సమన్వయంతో, క్షేత్రస్థాయిలో సమ ర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యాచరణ కోసం 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రతి బృందంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్తో పాటు నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉండ గా, అందులో ఒకరు మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తారని వివరించారు. తప్పిపోయిన పిల్లలు, వీధి బాలలను వేగంగా గుర్తించేందుకు ‘దర్పణ్ యాప్’ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగించనున్నట్లు వెల్లడించారు. బాలల హక్కులను కాలరాసే భిక్షాటన ముఠాలు, అక్రమ రవాణా మధ్యవర్తులు, బాల కార్మికత్వాన్ని ప్రోత్సహించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్న పోలీసులు, ఆపరేషన్ స్త్మ్రల్ ద్వారా బాలలకు సురక్షిత భవిష్యత్తు అందించడమే లక్ష్యమని వెల్లడించారు.