calender_icon.png 8 January, 2026 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13 నుంచి పరేడ్ గ్రౌండ్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్

04-01-2026 12:21:50 AM

ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీసీ ఎండీ క్రాంతి వల్లూరు 

సికింద్రాబాద్ జనవరి 3 (విజయ క్రాంతి): తెలంగాణ పర్యాటక రంగంలో అత్యంత వైభవంగా జరిగే అంతర్జాతీయ  పతంగులు  మిఠాయిల మహోత్సవం 2026’కు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదిక కానుంది. జనవరి 13 నుండి 15 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల ఏర్పాట్లను పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ క్రాంతి వల్లూరు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షించే విధంగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా ఈ ఉత్సవ  నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.  వివిధ దేశాలు, రాష్ట్రా ల నుండి వచ్చే  కైట్ ఫ్లైయర్స్,  మిఠాయి దుకాణాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా  చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి, ఈ వేడుకను ఒక మధుర జ్ఞాపకంగా మార్చాలని అధికారులను ఆదేశించారు.సందర్శకుల రద్దీని దృష్టి లో ఉంచుకుని పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్రాఫిక్ డీసీపీ  శ్రీనివాస్ నేతృత్వంలో వాహనాల మళ్లింపు, పార్కింగ్ మేనేజ్మెంట్ పర్యవేక్షణ చేస్తుండగా, అదనపు డీసీపీ వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షణ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ, జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుజాత, పర్యాటక శాఖ అధికారులు, గోపాలపురం ఏసిపి సుబ్బయ్య, ట్రాఫిక్ ఏసిపి శంకర్ రాజ్, బేగంపేట ఇన్స్పెక్టర్ జానకి రామ్, బేగంపేట్ ఇన్స్పెక్టర్ సైదులు ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.