calender_icon.png 12 July, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను కోటిశ్వరులను చెయ్యడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

12-07-2025 12:48:38 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, జూలై 11 (విజయ క్రాంతి): కాజీపేట్ ఫాతిమానగర్ బాలవికాస భవనంలో మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అదితిగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హజరైయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కోటి మంది మహిళలను కోటిశ్వరులను చెయ్యడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.

ప్రభుత్వం మహిళా సాధికారాతకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 2 కోట్ల 40 లక్షల రూపాయల చెక్కును స్వయం ఉపాధిత సంఘాలకు అందజేయ్యడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. యూనియన్ బ్యాంకు వారు ముందుకొచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలకు సహకారం అందించినందుకు వారిని అభినదించారు.

ప్రజా పాలనలో ప్రతి మహిళా ఒక ఇందిరా గాంధీ లాంటి శక్తివంతమైన మహిళగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక కార్పొరేటర్లు మానసరాంప్రసాద్, విజయశ్రీ రజలి, యూనియన్ బ్యాంకు అధికారులు, మెప్మా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.