calender_icon.png 30 January, 2026 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

27-09-2024 02:37:25 AM

ఎంపీ డీకే అరుణ

రంగారెడ్డి, సెప్టెంబర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చి న హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని మహబుబ్‌నగర్ ఎంపీ డీకే.అరుణ విమర్శించారు. గురువారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని రాయికల్, అన్నారం గ్రామల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఆమె పాల్గొని పలువురికి సభ్యత్వ నమోదు స్ల్లిప్పులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలుచేయడంలో విఫలం అవ్వడంతో హైడ్రా పేరిట ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.