calender_icon.png 25 December, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్కింగ్ జర్నలిస్టులను అయోమయానికి గురిచేస్తున్న జీఓ

25-12-2025 12:19:48 AM

కరీంనగర్,డిసెంబర్24(విజయక్రాంతి): ప్రభుత్వం 2026- సంవత్సరాలకు గాను నూతన అక్రిడిటేషన్ల జారీ కోసం వెలువరించిన 252 జీవో అస్పష్టంగా, జర్నలిస్టుల ప్ర యోజనాలకు భంగకరంగా ఉంది. ముఖ్యం గా జర్నలిస్టులు,డెస్క్ సిబ్బంది మధ్య విభజ న రేఖ గీసేందుకు ఈ జీవో ద్వారా ప్రభు త్వం ప్రయత్నించింది.

తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కో సం విడుదల చేసిన 239 జీవో డెస్క్ వీ ధు ల్లో ఉన్న సిబ్బందికి అయినా, నిత్యం వా ర్త సేకరణలో ఉన్న సిబ్బందికి అయినా ఒకే విధానాన్ని అనుసరించింది. కామన్ అక్రిడిటేషన్ విధానాన్ని కొనసాగించింది . అలాంటి పరిస్థితుల్లోనే జర్నలిస్టుల సంక్షేమ పథకాల అమలులో డెస్క్ జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తం గా తీవ్ర అన్యాయం జరిగింది.

జిల్లాలలో నివేషణ స్థలాల పంపిణీ జరిగినప్పుడు సంబం ధిత జిల్లాల జర్నలిస్టు సంఘ నాయకత్వాలు డెస్క్ జర్నలిస్టుల పట్ల చులకన భావంతో చూశాయి. రాష్ట్రంలో ఎడిషన్ కేంద్రాలు ఉన్న జిల్లాల సంఖ్య పరిమితమే. ఉదాహరణకు కరీంనగర్ లో ఎడిషన్ కేంద్రం ఉంటే నిజామాబాద్, ఆదిలాబాద్, జిల్లాల డెస్క్ లు కరీంనగర్ లోనే కొనసాగడం సహజం. ఈ విధానం కూడా డెస్క్ జర్నలిస్టులకు సమస్యలు తెచ్చిపెట్టింది.

ఆయా పత్రికల యా జమాన్యాలు ఏ డెస్క్ లో పనిచేసే సిబ్బందికి ఆ జిల్లాలలో మాత్రమే అక్రిడి టేషన్లు లభించేలా చూశారు. వాస్తవానికి వారు పనిచేసేది కరీంనగర్ లో అయితే , వారు పొందిన అక్రిడిటేషన్ కార్డులు ఇతర జిల్లాల్లో.. ఫలితంగా కరీంనగర్లో వారికి నివేషణ స్థలం కావాలం టే లభించే వీలు లేదు.. 

ఈజిఓ పై వర్కింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు ఆందోళనకి సిద్ధం అవుతున్నారు. లాయక్ పాషా , రాష్ట్ర ఉపధ్యక్షులు టి యూ డబ్ల్యు జె (143) పత్రిక యాజమాన్యాలు డెస్క్ జర్నలిస్టుల నియామక సమయంలో డెస్క్/ రిపోర్టింగ్ పేరిట నియామక పత్రాలు ఆరు దశాబ్దాలుగాజారీ చేస్తూన్నారు. ఇటు డెస్క్ అటు జర్న లిస్టులకుఒకే అక్రిడిటేషన్ విధానం అమల్లో ఉన్నప్పుడే సంక్షేమ పథకాల లబ్ధిలో డిస్క్ జర్నలిస్టులకు ఇంత వివక్ష జరిగితే, ప్రస్తుత జీవో ద్వారా ఇక వారి ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది. కనుక డెస్క్ జర్నలిస్టులు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. వారికి మా మద్దతు ఉంటుంది.

జీవో 252 ను సవరించాల్సి న అవసరం ఉంది: టిడబ్ల్యూ, జె, ఎఫ్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ మీడియా ఆక్రీడేషన్ రూల్స్ 2025 ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 తప్పుల తడకగా, జర్నలిస్ట్లకు అన్యా యం జరిగేటట్టు ఉంది. ఈ జీవోను సవరించాలి, ఈ జీవో కొద్దీ మంది జర్నలిస్ట్లకు మే లు చేసి, మెజారిటి జర్నలిస్ట్లకు వ్యతిరేకంగా ఉంది. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులపై విడుదల చేసిన జీవో హర్షనీయం: టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుశనపెల్లి రాజేందర్ టీబ్ల్యూజేఎఫ్ పోరాటాల ప్రతిఫలమే ప్రభుత్వం జీవో జారీ చేసేలా చర్యలు చేపట్టింది.జర్నలిస్ట్ ల హక్కుల కోసం, వారి సమస్యలపై పోరాడడములో తమ రాష్ట్ర కమిటీ ఎప్పుడు ముందంజలో ఉంటున్నది.

రెండు సంవత్సరాలుగా అక్రిడిటేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వo జాప్యం చేసింది టీడ బ్ల్యూజేఎఫ్ అలుపెరగని పోరాటాల వల్లనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అక్రిడిటేషన్ కా ర్డుల అంశం తెరపైకి తెచ్చింది. గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టాన్ని అమల్లోకి తీ సుకురావడం, జర్నలిస్ట్ యొక్క కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ గా నిర్ణయించడo అభి నందనీయం అన్నారు. కొందరు కనీస విద్యార్హత లేకుండా జర్నలిస్ట్ లుగా కొనసాగుతున్నారన్నారు.