25-12-2025 02:02:17 AM
సచివాలయంలో అధికారులను కోరిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్, డిసెంబర్ 24(విజయ క్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను కోరారు. సచివాలయంలో వివిధ శాఖల అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. బ్రాహ్మణ సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. గతంలో మంత్రి శ్రీధర్ బాబును కలి సి వినతిపత్రం సమర్పించగా కలెక్టర్ కు సిఫార్సు చేశారని తెలిపారు. కలెక్టర్ సి సి ఎల్ ఏ కు ఫైలు పంపారని, వెంటనే స్థలం కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో బ్రాహ్మణ సంఘ సభ్యులు బిటి శ్రీనివాస్, నంద ప్రసాద్, ప్రభాకర్ రావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముస్లిం, క్రైస్తవులకు సంబంధించిన సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ షఫీ ఉల్లాను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కోరారు. ముస్లిం, క్రైస్తవులకు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని, గత సంవత్సరం వక్ఫ్ ప్రాపర్టీలో చేర్చిన పలు కాలనీల నివాస ప్రాంతాలను ప్రొ హిబిటెడ్ ప్రాపర్టీస్ అండ ర్ 22 ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతి కల్పించాలని కోరారు.
మల్కాజ్గిరిలో డ్రైనేజీ, తాగునీటి పనులు వేగవంతం చేయాలని జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాయాక్ మిట్టల్, డిపిఓ శ్రీధర్ ను కలిసి విన్నవించారు. బోర్వెల్ పంపు లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీని వాసరెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, రమేష్ పాల్గొన్నారు.