05-01-2026 12:54:08 AM
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు
హనుమకొండ టౌన్, జనవరి 4 (విజయక్రాంతి): మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కొరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అసెంబ్లీ వేదికగా గలమెత్తి మున్నూరు కాపుల అభిమానం సంపాదించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన నిధులు కేటాయింపులపై ప్రభుత్వ స్థాయిలో సమగ్రంగా చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ అంశాన్ని పై మాట్లాడాలని మున్నూరు కాపు నేతలు, కాంగ్రెస్ నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
ఉమ్మడి పది జిల్లాలకు చెందిన నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు సమయం కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించగా వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, చిట్ల సత్యనారాయణ, రుద్ర సంతోష్, తూము వినయ్, గద్వాల జిల్లా అధ్యక్షులు మలిచేటి రాజీవ్ రెడ్డి లు తదితరులు పాల్గొన్నారు.