05-01-2026 12:52:48 AM
హనుమకొండ టౌన్, జనవరి 4 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలోని చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆదివారం హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన జడ్జి దంపతులకు దేవాలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి, అమ్మవారి శేషవస్త్రములు బహుకరించి మహా దాశీర్వచనం నిర్వహించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ సీనియర్ సివిల్ జడ్జి రామలింగం, దేవాలయ ధర్మకర్త తనుపూనూరి వీరన్న తదితరులు పాల్గొన్నారు.