18-10-2025 12:00:00 AM
మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి
ఘట్‌కేసర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎదులాబాద్, అంకుశాపూర్ లలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీవో వెంకటరెడ్డితో కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
రైతులు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తేమశాతం 17కు మించకుండ దాన్యంను కేంద్రానికి తీసుకురావాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం వరికి మద్దతు ధర ఏ గ్రేడ్ కు రూ. 2389, కామన్ రకానికి రూ. 2369 ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు తాము పండించిన ధాన్యంను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను ఆశ్రయిoచి మోసపోవద్దన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్‌ఓ శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల డీఎం సుగుణబాయి, ఘట్ కేసర్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాoరెడ్డి, వైస్ చైర్మన్ అనంతరెడ్డి, ఎండి రాహుల్ రాజ్, ఏఓ లావణ్య, ఎఈవో జగదీష్, డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, మహేందర్ నాయక్, ఉదయ్ కుమార్ రెడ్డి, నాయకులు కుదుల కుమార్, రైతులు పాల్గొన్నారు.