24-01-2026 12:06:37 AM
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఆలేరు, జనవరి 23 : చేనేత కార్మికుల అభివృద్ధి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. స్థానిక చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఆలేరు నందు శుక్రవారం చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేసిన రుణమాఫీ పథకం చెక్కులను వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలోని చేనేత కార్మికులకు గతంలో కొన్ని బ్యాంకు మాకు రుణాలు ఇచ్చారనీ, అవి కట్టలేని స్థితిలో మేము ఉన్నందున వెంటనే వాటిని మాఫీ చేయాలని కోరారు.
వెంటనే చేనేత కార్మికులను చేనేత జౌలిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్దకు తీసుకువెళ్లి విషయం వివరించానన్నారు. దీనికి స్పందించిన మంత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని 2380 మంది చేనేత కార్మికులకు చేనేత రుణమాఫీ కింద 19 కోట్ల 25 లక్షల రూపాయలు మాఫీ కొరకు ప్రతిపాదనలు పంపారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక యాదాద్రి భువనగిరి జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల అందరికీ రుణమాఫీ పై సంతకం చేశాతన్నారు.
ఈ ఒక్కరోజులేనే ఈ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి శ్రీనివాస్, బండ్రు శోభారాణి, జనగామ ఉపేందర్ రెడ్డి, ఎగిరి శ్రీశైలం, ఏజాజ్, చింతకింది మురళి, జనం టీవీ శంకర్, బీజన భాస్కర్, రచ్చ హన్మంతు, ఎలగందుల యాదగిరి, చింతకింది సిద్దులు, గుండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.