24-01-2026 12:06:45 AM
రేవల్లి జనవరి 23: ప్రజల్లో పొదుపు అలవాట్లు, బ్యాంకింగ్ సేవలపై అవగాహన కొరకు మం డలంలోని తల్పునూర్ గ్రామంలో శుక్రవారం ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత సదస్సు నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నాగర్కర్నూల్ రీజినల్ పరిధిలోని పెద్దమందడశాఖ ఆధ్వ ర్యంలో, నాబార్డు సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఈవెంట్ కళాజాత బృందం ప్రదర్శించిన ఆటపాటతో మ్యాజిక్ షోలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వ్యవసాయ రుణాల లభ్యత, చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలు. వ్యక్తిగత రుణాలు, తక్కువ వడ్డీకే బంగారు ఆభరణాలపై రుణాల గురించి అవగాహన కల్పించారు. మొబైల్ బ్యాంకింగ్, రూపేకార్డుల వినియోగo, సైబర్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను మ్యాజిక్ షో ద్వారా వివరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక భద్రతను కలిగి ఉండాలని బ్యాంక్ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడ బ్రాంచ్ మేనేజర్, ఫీల్ ఆఫీసర్, బ్యాంక్ సిబ్బంది, డ్వాక్రా ఏపీవో, స్వయం సహాయక సంఘాల మహిళలు, తలుపునూరు గ్రామస్తులున్నారు.