26-09-2025 01:12:04 AM
పుస్తకాల్లో చేర్చిన కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం, సెప్టెంబర్ 25: పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ విధులు, బాధ్యతల గురించి పదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో చేర్చింది. అందులో గవర్నర్ పదవిని చేపట్టే వ్యక్తి ఎన్నికవడని, అతడు కూడా సాధారణ వ్యక్తే అని అభివర్ణించింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందానికే అధిక పవర్స్ ఉంటాయని పేర్కొంది.
పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు కొద్ది రోజులుగా గొడవ జరుగుతోంది. మహ్మద్ అరీఫ్ ఖాన్ అనంతరం రాజేంద్ర అర్లేకర్ ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ‘డెమోక్రసీ’ అనే అధ్యాయంలో దీన్ని జతచేశారు. గవర్నర్ అధికారాల గురించి పాఠ్యాంశాన్ని జత చేస్తున్నట్టు కేరళ విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టీ ఇటీవలే ప్రకటించారు.