26-09-2025 01:23:19 AM
బీజింగ్, సెప్టెంబర్ 25: అమెరికాకు చెందిన ఆరు కంపెనీలపై చైనా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తైవాన్‌కు సైనిక సాంకేతిక సహకారం అందిస్తున్నాయన్న కారణంతో సదరు కంపెనీలు చైనాతో వాణిజ్యం చేయకుండా నిషేధించింది. మానవరహిత వాహనాలు తయారు చేసే సరోనిక్ టెక్నాలజీస్, శాటిలైట్ టెక్నాలజీ సంస్థ ఎయిర్‌కోమ్, సబ్‌సీ ఇంజనీ రింగ్ సంస్థ ఓషనీరింగ్ ఇంటర్నేషనల్ సంస్థలు చైనా నిషేధం విధించిన కంపెనీల జాబితాలో ఉన్నాయి.