09-04-2025 02:23:13 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
కోదాడ/ మునగాల.ఏప్రిల్ 8: ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కోదాడ, మునగాల మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా నల్లబండగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణిని పరిశీలించి కలెక్టర్ అదే గ్రామంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లను పరిశీలించి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు.
అనంతరం బరాకత్ గూడెం గ్రామంలో గల పిఎసిఎస్ సన్నధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖి చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. కోదాడ డివిజన్లో 68 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుత సీజన్లో ఇప్పటికి 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు 212 సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు 74 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి , సొసైటీ అధ్యక్షులు కొత్త రఘుపతి ,కందిబండ సత్యనారాయణ ,ఆర్డిఓ సూర్యనారాయణ, తాసిల్దార్లు వి. ఆంజనేయులు, ఆజిద్ అలి, ఎంఏఓ రాజు, ఏఈఓ రేష్మ, పాల్గొన్నారు.