04-11-2025 12:51:05 AM
							నిర్మల్, నవంబర్ ౩ (విజయక్రాంతి): ఉన్నత చదువుల కోసం ఏర్పాటుచేసిన డిగ్రీ కళాశాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది . విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి డిగ్రీ పట్టా అందించే ప్రైవేటు విద్యాసంస్థలు ఐదేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో నిరసన బాట పట్టారు. విద్యార్థులకు ప్రతి సంవత్సరం చెల్లించవలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకూడదు సోమవారం నుంచి రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు నిరవధిక బందులోకి దిగడంతో విద్యార్థుల చదువు భవిష్యత్తు రోడ్డున పడ్డది.
ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని వివిధ రూపాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వానికి డిమాండ్ చేసిన పెండింగ్ బకాయిలు విడుదల కాకపోవడంతో కాలేజీలను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో విద్యాసంస్థలు కాలేజీల బందుకు పిలుపునిచ్చాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్ ఖానాపూర్ ముధోల్ సారంగాపూర్ కుంటాల లోకేశ్వరం కడెం తదితర ప్రాంతాల్లో 25 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నట్టు యజమానులు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ కి అనుబంధంగా నిర్మల్ జిల్లాలో ఈ కళాశాలలో నిర్వహిస్తుండగా సుమారు 12000 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా డిగ్రీని చదువుతున్నారు ప్రైవేటు.
డిగ్రీలో చేరిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూపాయలు 12,000 నుంచి 15000 విద్యార్థి కాలేజీ ఖాతాలో ఖాతాలో జమ చేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్ మెంట్ ఆధారంగానే ప్రైవేటు డిగ్రీ కళాశాలలు విద్యా బోధన నిర్వహిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థి ఖాతాలో జమ చేస్తే ఆ ఫీజులు కాలేజీ యాజమాన్యానికి ఫీజు రూపంలో విద్యార్థులు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది.
ఐదేళ్లు రూ.40 కోట్లు బకాయి
నిర్మల్ జిల్లాలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ 2021 నుంచి పెండింగ్లో ఉన్నట్టు యాజ మాన్యాలు తెలిపాయి. 2021- 2౦౨2 2౦౨3 2౦౨4 సంవత్సర సంబందించిన ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉంది. 2023 వరకు రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారులు ఉండగా 2023 డిసెంబర్ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారులు ఉంది.
బకాయిల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం యాజమాన్లతో చర్చలు జరిపినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు పెండింగ్ బకాయిల సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు నామమాత్రంగా కేటాయించడంతో అవి యాజమాన్యాలకు అవసరా లకు సరిపోవడం లేదని వారు పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఫీజు రియంబర్మేట్ నిధులు దశలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ హామీ నెరవేర్చుకోవడం లేదని నిర్మల్ జిల్లా ప్రైవే టు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు తెలిపా యి. జిల్లాలో 25 కళాశాలకు సంబంధించిన బకాయిలు సుమారు 40 కోట్ల వరకు ఉం టుందని వారు పేర్కొంటున్నారు.
ప్రైవేటు కళాశాలలు అద్దె భవనంలో నిర్వహించడం విద్యార్థులకు బోధన చేసే అధ్యాపకులకు వేతనాలు నిర్వహణ ఖర్చులు తడిసి మోపిడి కావడంతో అప్పులు తెచ్చి కళాశాలలో నిర్వహించారు. ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలయితే అప్పులు తీరిపోతాయని ఆశతో ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటికే చాలా కళాశాలలు మూతపడే దశకు చేరుకున్నాయి
పేద విద్యార్థులకు నష్టమే
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కళాశాలలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సోమవారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో డిగ్రీ చదివే విద్యార్థుల చదువు పై తీవ్ర ప్రభావం పడనుంది. కళాశాలలో బంద్ చేయడంతో విద్యార్థుల చదువు తరగతుల నిర్మాణం తాత్కాలికంగా బ్రేక్ పడడంతో డిగ్రీ చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశతో ఉన్న పేద విద్యార్థులు ప్రభుత్వ వైఖరి యాజమాన్యాల బంధు తీవ్ర నష్టానికి గురిచేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాగా కొత్తగా చేరిన విద్యార్థులకు కళాశాల బందు కారణంగా చదువుకునే పరిస్థితి లేదు. కళాశాలలో చదువు చెప్పి అధ్యా పకులకు కూడా ప్రభుత్వ బకాయిలను సాకు గా చూపి వేతనాలు ఇవ్వకపోవడంతో చాలామంది ప్రైవేట్ అధ్యాపకులు విద్యా బోధన పై అంత ఆసక్తి చూపడం లేదు. సోమవారం నుంచి జిల్లాలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు బంద్ పాటించడంతో చదువుకున్న విద్యార్థులకు చదువుకు ఆటగా కలగడంతో మానసిక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేసి పేద విద్యార్థులకు చేయూతను అందించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
నిర్మల్ జిల్లాలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఐదేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు. జిల్లాలో మొత్తం 25 కళాశాలలు ఉండగా 40 కోట్ల వరకు ప్రభుత్వ బకాయి రావాల్సి ఉంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నరేష్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు
ఇబ్బందులు ఉన్న చదువుకే ప్రాధాన్యత ఇచ్చాం
నిర్మల్ జిల్లాలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి డిగ్రీ విద్యను అందించేందుకు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15000 ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థి ఖాతాలో జమ చేయాలి. ఆ డబ్బులతోనే కాలేజీ బోధన ఫీజు తల్లిదండ్రులు చెల్లిస్తారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో కాలేజీ నిర్వహణ అధ్యాపకులకు వేతనాలు ఇతర అవసరాల కోసం అప్పులు తెచ్చి అనే క ఇబ్బందులకు గురవుతున్నాం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. అఖిలేష్ కుమార్ ప్రిన్సిపాల్ వశిష్ట డిగ్రీ కాలేజ్
విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి
ప్రభుత్వం బకాయిలపడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విడుదల చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేకసార్లు ప్రభు త్వం దృష్టికి తీసుకుపోయేలా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బకాయిల కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు నిరువదిక బంధు పాటించడం వల్ల ఆ కళాశాలలో చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే ఫీవర్ మెంట్ విషయంలో యాజమాన్లతో చర్చలు జరిపి కళాశాల చదువు కొనసాగించే విధం గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ విద్యార్థులపై ప్రభుత్వం వెంటనే కనికరం చూపాలి. వెంకటేష్ పీడీఎస్‌యు జిల్లా అధ్యక్షుడు