calender_icon.png 16 August, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సైకిల్ దొంగ’ నిస్సహాయత

04-08-2025 12:00:00 AM

లూయిగో బార్టోలిని అనే ఇటాలియన్ రచయిత, చిత్రకారుడు  1946లో రాసిన నవల ‘బైస్కిల్ థీవ్స్’ (సైకిల్ దొంగలు). పుస్తకం ఆధారంగా విక్టోరియా డిసిక అనే సినీ దర్శకుడు హాలీవుడ్‌లో ‘బైస్కిల్ థీవ్స్’ అనే సినిమా తీశాడు. అప్పటికీ ఇప్పటికీ ఆ చిత్రం ఒక క్లాసిక్. ఒక చిన్న నేరం వెనుక ఉన్న లోతైన మానసిక సంఘర్షణను, సామాజిక వాస్తవాలను పుస్తకం కుండ బద్ద లు కొట్టినట్టు చెప్తుందీ కథ.

ఎంతోమంది దిగ్దర్శకులకు ఈ చిత్రం ఇష్టం. ఈ సినిమా చూసి డైరెక్టర్లు అవ్వాలని కోరుకుని,  సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు.  అలాంటి క్లాసిక్ నవల తెలుగు అనువాదం ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నది.

యువ రచయి త అనిల్ బత్తుల బుక్‌ను తెలుగులోకి అనువదించారు. ఇక కథ విషయా నికి వస్తే.. ఇది కేవలం ఒక సైకిల్ దొంగతనం నేపథ్యంలో జరిగే కథ. అదే సమయంలో సమాజంలోని అసమానతలు, పేదరికం, మనుషుల బలహీనతలను అంతర్లీనంగా విశ్లేషించే విధంగా కథనం సాగుతుంది. 

కథలో ప్రధాన పాత్ర ఒక యువకుడిది. అతడు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఒక పక్క సమాజం నుంచి వచ్చే ఒత్తిడి, మరో పక్క తన సొంత కలలు.. వాటి మధ్య నలిగిపోతూ, అనుకోకుండా ఒక సైకి ల్ దొంగగా మారతాడు. ఈ క్రమంలో అత డు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు..

చివరికి అతడికి ఏం జరిగింది అనేదే కథలోని ప్రధాన కథాంశం. ఒక మనిషి ఏ పరిస్థితిలో సైకిల్ దొంగతనానికి పాల్పడతాడు. అతడు నిస్సహాయతకు ఎందుకు గురవుతాడు. సమాజంపై అతడికి ఎందుకు తిరుగుబాటు వైఖరి ఏర్పడుతుంది.. అనేది పుస్తకం పూర్తిగా చదివితే అర్థమవుతుంది. అనిల్ బత్తుల కథన శైలి చాలా పదునుగా, వాస్తవికంగా ఉంటుంది. ముఖ్యంగా రవి పాత్రను తీర్చిదిద్దిన విధానం అద్భుతం.

అతడి బాధ, ఆశలు, భయాలు పాఠకులకు స్పష్టంగా అర్థమవుతాయి. కేవలం రవి పాత్రే కాకుండా, అతడిని వెంటాడే పోలీస్ అధికారి, అతడికి సహాయం చేసే స్నేహితులు వంటి ఇతర పాత్రలు కూడా చాలా సహజంగా ఉంటాయి. ప్రతి పాత్రకు ఒక లోతైన నేపథ్యం ఉంటుంది. రచయిత మాటల ద్వారా కాకుండా పాత్రల చర్యల ద్వారానే వారి వ్యక్తిత్వాలను పరిచయం చేస్తా రు. ఈ కథనం చాలా వేగంగా సాగి, ఎక్కడా బోర్ కొట్టకుండా పాఠకులను ఆకట్టుకుంటుంది. ‘సైకిల్ దొంగ’ కేవలం ఒక దొంగత నం కథ మాత్రమే కాదు. ఇందులో ఎన్నో అంశాలు చర్చకు వస్తాయి. 

ఒక మనిషిని పేదిరకం ఎలా నేరస్తుడిగా మారుస్తుందో ఈ పుస్తకం కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. డబ్బు, హోదా లాంటివి మనిషి విలువలను ఎలా తారుమారు చేస్తాయో వివరి స్తుంది. కష్టకాలంలో మనుషులు ఎలా ఉంటారు.. నిజమైన స్నేహమంటే ఏమిటి వంటి విషయాలను సున్నితంగా స్పృశిస్తుంది. తప్పు చేసిన తర్వాత మనిషిలో కలిగే పశ్చాత్తాపం, దాని నుంచి బయటపడటానికి పడే ఆరాటాన్ని ఆసక్తికరంగా ఆవిష్క రించారు. 

మొత్తానికి, ఈ ‘సైకిల్ దొంగ’ పుస్తకం అద్భుతమైన నవల. ఇది పాఠకులను ఆలోచింపజేస్తుంది. వారి హృదయాలను తాకు తుంది. పుస్తకం పాఠకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఒక పాఠం. ప్రతిఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకాల్లో ఇది ఒకటి.

ఇటాలియన్ మూలం: లూయిగో బార్టోలిని తెలుగు అనువాదకుడు: అనిల్ బత్తుల