calender_icon.png 31 January, 2026 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కిళ్లు ఆగడం లేదా?

06-12-2024 12:00:00 AM

ఎక్కిళ్లు ఎప్పుడు వస్తాయో.. ఎలా వస్తాయో చెప్పలేం.. కొందరికి ఎక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి. మరికొందరికి ఎంతకూ ఆగవు. ఎన్ని నీళ్లు తాగినా ఎక్కిళ్లు ఆగవు. సాధారణంగా ఎవరికైన ఎక్కిళ్లు వస్తే.. ఎవరో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని భావిస్తారు. కానీ అది నిజం కాదు. చాలా వేడిగా, చాలా చల్లగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల ఎక్కిళ్లు వస్తాయి. ఎక్కిళ్లు చిటికెలో ఆపాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 

* ఎక్కిళ్లు వచ్చిన వెంటనే చల్లటి లేదా వేడి నీరు తాగాలి. ఇది ఎక్కిళ్ల సమస్యను తక్షణమే తగ్గిస్తుంది. 

* ఎక్కిళ్లు వచ్చిన వెంటనే మెడ భాగాన్ని వెనుక నుంచి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ చిట్కా బాగా పని చేస్తుంది. 

* ఎక్కిళ్లు వచ్చే వ్యక్తి దృష్టిని మరల్చడం వల్ల ఎక్కిళ్లను క్షణంలో ఆపవచ్చు

* ముక్కును చేతులతో గట్టిగా పట్టుకోవాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లోని కార్బన్‌డై ఆక్సైడ్ బయటకు వెళ్లి ఎక్కిళ్లు ఆగుతాయి. 

* బొటనవేలుతో అరచేతిని మసాజ్ చేయడం వల్ల కూడా ఎక్కిళ్లు ఆగిపోతాయి. 

* నీళ్లు తాగిన తర్వాత ఎక్కిళ్లు ఆగకపోతే నాలుక బయటపెట్టి కాసేపు అలాగే ఉంచండి. ఇది గొంతు కండరాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో ఎక్కిళ్లు ఆగుతాయి. 

* ఒక చెంచా చక్కెర తీసుకుని బాగా నమిలి అరగ్లాసు నీళ్లు తాగాలి. ఇలా చేస్తే ఎక్కిళ్లు అకస్మాత్తుగా ఆగిపోతాయి. 

* పేపర్ బ్యాగ్ ఉంటే అందులోంచి పదిసార్లు ఊపిరి పీల్చుకున్నా ఎక్కిళ్లు ఆగుతాయి.