31-01-2026 12:36:19 AM
నిజామాబాద్ జనవరి 30 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరం గాంధీ చౌక్‌లోని గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
గాంధీ పేరును పాత పద్ధతిలోనే యధా విధంగా కొనసాగించాలని, బిజెపి చేస్తున్న పుట్టలను గమనిస్తున్నారని, బిజెపి తమకు బలం ఉంది అని అనుకుంటున్నారని రాబో యే 2029 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానిగా మళ్లీ ఉపాధి హామీ పనిని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని మారుస్తామని ఉపాధి హామీ పని ని కొనసాగిస్తామని నగేష్ రెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు గణరాజ్,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, డిచ్పల్లి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు వాసు,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,నగర మైనారిటీ అధ్యక్షులు ఎజాస్, మార్కెట్ కమిటీ సభ్యులు ఈసా,స్వప్న,బంటు బలరాం,సలీం, నూర్, అయ్యుబ్ తదితరులు పాల్గొన్నారు.