calender_icon.png 31 January, 2026 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగాహనతో కుష్టువ్యాధి నివారణ

31-01-2026 12:36:55 AM

డాక్టర్ గుగులోతు రవి నాయక్

మరిపెడ,జనవరి 30(విజయక్రాంతి): మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో జాతీయ కుష్టు అవగాహన కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో జాతీయ కుష్టు అవగాహన పక్షోత్స వాల కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ రవి మాట్లాడుతూ 30 జనవరి 2026 రోజున మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కుష్టి వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రతి పిహెచ్సిలో మరియు ప్రతి గ్రా మపంచాయతీలో వైద్య ఆరోగ్య సిబ్బంది  అవగాహన నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో ప్రతిజ్ఞ చేయిస్తూ కుష్టు వ్యాధి పై సంపూర్ణ అవగాహన కలిగే విధం గా కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలియజేశారు.

‘స్పర్శ‘ (స్పర్శ్) అనేది భారతదేశంలో కుష్టు వ్యాధి (లెప్రసి) పట్ల అవగాహన కల్పించడానికి మరియు సామాజిక వివక్షను తొలగించడానికి ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన ప్రచారం. స్పర్శ్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ (ఎస్ ఎల్ ఏ సి) భారత ప్రభు త్వం ఈ ప్రచారాన్ని జనవరి 30, 2017న (మహాత్మా గాంధీ వర్ధంతి - అంటి లెప్రసీ డే) ప్రారంభించింది.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కుష్టు వ్యాధి గురించి సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షను తగ్గించడం మరియు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం.

ముఖ్యం గా ఈ కార్యక్రమాలు గ్రామ సభలు నిర్వహించడం, పాఠశాల విద్యార్థుల ద్వారా అవగాహన కల్పించడం మరియు ఇంటింటికీ తిరిగి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం వంటివి చేస్తారు.కుష్టు వ్యాధి లక్షణాలు ముఖ్యంగా చర్మంపై స్పర్శ లేని (నొప్పి, వేడి తెలియని) తేలికపాటి రంగు మచ్చలు ఏర్పడటం కుష్టు వ్యాధి ప్రాథమిక లక్షణం.ఇది మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.దీనికిచికిత్స ప్రభుత్వ ఆసుపత్రులలో మల్టీ-డ్రగ్ థెరపీ (యం డి టి) ద్వారా కుష్టు వ్యాధికి ఉచితంగా చికిత్స అందిస్తారు.

ఇది సకాలంలో వాడితే వ్యాధి పూర్తిగా నయమవు తుంది మరియు వైకల్యాన్ని నివారించవ చ్చు.ఇది స్పర్శ ద్వారా (తాకడం వల్ల) వ్యాపించదు. చికిత్స తీసుకోని వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే చాలా కాలం సన్నిహితంగా ఉంటే వ్యాపించే అవకాశం ఉంటుం ది. మరింత సమాచారం కోసం మీరు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని (పి హచ్ సి) సంప్రదించవచ్చని తెలిపారు.కార్యక్రమంలో డాక్టర్ పూజిత, పబ్లిక్ హెల్త్ నర్స్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ ఆచార్యులు, లక్ష్మీకుమారి, ల్యాబ్ టెక్నిషన్ అనిత,స్టాఫ్ నర్స్ పద్మ,రత్న, మమత,హెల్త్ అసిస్టెంట్ వీర య్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.