calender_icon.png 31 January, 2026 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు

31-01-2026 12:00:00 AM

చిట్యాల, జనవరి 30 : గత పదేండ్లలో కేసిఆర్  చేసిన అభివృధి సంక్షేమాన్ని చూసి ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ పాలన  కోరుకుంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిమ్మనగోటి శ్రీను మరియు యువశక్తి యూత్ కి చెందిన వంద మంది యువకులు ఆయన సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.

గత పదేండ్లలో కేసిఆర్  చేసిన అభివృధి సంక్షేమాన్ని చూసే ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. అమలుకాని హామీలు, మోసపూరిత గ్యారెంటీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి కూర్చిందని, రెండేళ్లలో పైసా పని చెయ్యని  రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలిపారు.

బిఆర్‌ఎస్ హయంలో కేసీఆర్  నాయకత్వంలోనే చిట్యాల అభివృద్ధి జరిగిందని, కేసీఆర్ ప్రభుత్వంలో  తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 40 కోట్లతో మున్సిపాలిటీలో అనేక పనులు చేపట్టామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీదీ ప్రజా పాలన కాదు ముమ్మాటికి కక్ష సాధింపు పాలన అని, చిట్యాల మున్సిపాలిటీలో ప్రతీ ఓటరు బిఆర్‌ఎస్ పార్టీపై సానుకూల స్పందన కనబరుస్తున్నారని, మున్సిపాలిటీలో అన్ని వార్డులను బంపర్ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి బహుమతిగా పంపుదామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఎన్నికల ఇంచార్జి చాడ కిషన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శేపూరి రవీందర్, పొన్నం లక్ష్మయ్య, కొలను వెంకటేశం, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.