31-01-2026 12:00:00 AM
కుత్బుల్లాపూర్, జనవరి 30 (విజయక్రాంతి): అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అమ్యమ్యాయాలకు అలవాటు పడ్డారని స్థానికులు విమర్శిస్తున్నారు. స్థాయి చిన్నదే అయిన వ్యవస్థనే దహించే నియంతలా ఓ చైన్ మె న్ మారడంటూ స్థానికులు ఆరోపిస్తున్నా రు. తనపై చర్యలు తీసుకోవాలన్న అధికారుల వల్ల కావడం లేదు అంటే అర్థం చేసు కోవచ్చు సదరు చైన్‌మెన్ ప్రభావం ఏ స్థాయికి చేరిందని.
సాధారణమైన ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోలేని స్థితిలో చేతులు కట్టుకొని ఉన్నారనే ఆరోపణలు స్థానికంగా నిత్యం వెలువడుతున్న, అధికారుల మౌనం మరిం త ఊతం ఇచ్చే విధంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. దుండిగల్ సర్కిల్‌లోని గాగిల్లాపూర్, మల్లంపేట పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొన సాగుతున్న నేపథ్యంలో అధికారుల చర్యలు కేవలం కాగితాల వరకే పరిమితం అవుతున్నాయి అని అందుకు గల కారణం ఆ పరి ధికి చైన్‌మెన్‌గా విధులు నిర్వహించే వ్యక్తే కారణం అని స్థానికంగా బలంగా వినిపిస్తు న్న విమర్శ.
స్థానికంగా ప్రధానంగా వినిపిస్తున్న మరో ఆరోపణ ఏంటంటే అక్రమ నిర్మాణదారులకు సహాయ సహకారాలతో పాటు సలహాలు ఇస్తున్న నేపథ్యంలో అక్రమ నిర్మాణాల గురించి చైన్ మెన్ ను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ నిర్మాణదారులకు మద్దతుగా సమాధానం ఇస్తున్నాడని,వారు స్థానికులని పలుకుబడి ఉన్న పెద్ద మనుషులంటూ ప్రశ్నించే వారిపై ఇరగబడుతుం టాడని స్థానికులు పెదవి విరుస్తున్నారు.
అక్రమార్కులతో కుమ్మక్కు..
అక్రమ నిర్మాణధారులతో సదరు చైన్ మెన్ కుమ్మక్కై దిక్కుమాలిన సలహాలతో ధైర్యాన్ని నూరిపోసి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో వసూళ్ళు చేస్తూ అధికారుల చేతులను చిల్లరతో తడిపి తనపై చర్యలు తీసుకోకుండా అడ్డుకట్ట వేస్తాడనే గుసగుసలు సర్కిల్ కార్యాలయంలోనే వినిపిస్తు న్నాయి.
బాధ్యత గల పదవిలో ఉన్న అధికారులు సదరు చైన్ మెన్ మోచేతి నీళ్లకు అలవాటు పడడం వలనే తనపై చర్యలు తీసుకోకుండా కళ్ళెం పడుతుందని స్థానికులనుండి వెలువడుతున్న అభిప్రాయం. అందుకు తగ్గట్టే అధికారులు సైతం సదరు చైన్ మెన్ పై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కించడం అధికారుల పరోక్ష ఆశీర్వాదం చైన్ మెన్ పై ఉన్నాయి అనే వాదనలు కూడా లేకపోలేదు.
వార్త కథనాలు, ఫిర్యాదులు వెలువడి అధికారులపై ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో చైన్ మెన్ పై చర్యలు తీసుకుంటే అధికారుల దందా ఎక్కడ బట్టబయలు అవుతుందనే చర్యలకు వెనుకడుగు వేయడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉన్నారనే రోజురోజుకి స్థానికులలో బలపడుతుంది. ఇప్పటికైనా అధికారులు కలుగచేసుకుని వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధం గా అక్రమ నిర్మాణాలు వాటికి సహకరిస్తున్న ఇంటి దొంగల పై చర్యలు తీసుకోవా లని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం..
సంబంధిత చైన్ మెన్ పట్ల వస్తున్న ఆరోపణలపై, అక్రమ నిర్మాణాలపై దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ని వివరణ కోరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.