31-01-2026 12:38:12 AM
సర్వోదయ చరక సంఘటన్‌ను ప్రారంభించిన మీనాక్షి నటరాజన్
హనుమకొండ టౌన్, జనవరి 30 (విజయక్రాంతి): హనుమకొండ డిసిసి భవన్ లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనా క్షి నటరాజన్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అయ్యూబ్ లు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలుత హనుమకొండ జిల్లా కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
డిసిసి భవన్ లో ఏర్పాటు చేసిన సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వివరాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ప్రారంభించారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ గాంధీ సై ద్దాంతిక, సిద్ధాంత విలువలను తెలిపేదే చరక అని తెలిపారు. ఈ చరక ద్వారా గాంధీ ఆలోచనలను వ్యక్తపరచవచ్చని, దూది నుంచి నూలు దారాన్ని ఎలా తీస్తామో, సమాజంలో ఉన్న సమస్యలను విడడానికి మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ చరక మనిషిని మనిషిగా ప్రేమ, సత్యాన్ని కలుపుతోందని, ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లాలో జరుపుకో వడం అందులో గాంధీ వర్ధంతి రోజున నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇదే మహాత్మాగాంధీ కి ఇచ్చే ని జమైన నివాళి అని, అతిగొప్ప శ్రద్ధాంజలి అని అన్నారు.
గాంధీజీ చూపిన మార్గమే నేటి సమాజానికి దిశానిర్దేశమని, ఆయన సిద్ధాంతాలను కేవలం మాటల్లో కాకుండా ఆచరణ లో పెట్టినప్పుడే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో ముందు కెళ్తుందని, గాంధీ బోధించిన సత్యం, అహిం సా మార్గమే దేశానికి శాశ్వతమైన బలమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, రాష్ట్ర టిపిసిసి ప్రధాన కార్యదర్శిలు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దుదిల్ల శ్రీను బాబు, ఈ.వి శ్రీనివాసరా వు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వరరావు, జాతీయ కోఆర్డినేటర్ పులి అనిల్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.