calender_icon.png 31 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏ ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్‌పై హైకోర్టులో విచారణ

31-12-2025 01:01:07 AM

టీసీఏ పిటిషన్‌పై వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

హైదరాబాద్, డిసెంబర్ 30: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దాఖ లు చేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారించింది. టీసీఏ సమర్పించిన వాదన ప్రకారం ఈ టోర్నమెంట్ బీసీసీఐ ఆమోదించిన క్యాలెండర్‌లో భాగం కాదని, అలాగే బీసీసీఐ రాజ్యాంగంలో ని 30వ నియమం ప్రకారం ముందస్తు అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

నిబంధనలకు విరుద్ధంగా ఈ టోర్నీ నిర్విహిస్తున్నట్టు వాదించింది. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి హెచ్‌సిఏ , టీసీఏతో సంప్రదించి సమన్వయం తో పనిచేయాల్సి ఉండగా ఆ ఆదేశాలు పాటించలేదని న్యాయస్థానం ముందుకు టీసీఏ తర పు లాయర్ తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో టీసీఏ లోకస్ స్టాండీ అంశం కూడా ప్రస్తావించారు. బీసీసీఐ రాజ్యాంగంలోని 31వ నయమం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.