calender_icon.png 23 May, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలి

23-05-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,మే22( విజయ క్రాంతి): మహనీయుల చరిత్రను, వారి త్యా గాలను భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువా రం  కలెక్టరేట్‌లో జిల్లా షెడ్యూల్ కులాలు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలలో ఆ శాఖ ఉపసంచాలకులు సజీవన్, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి హాజరై చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేసిన దీన జన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ అని తెలిపారు. దళిత ఉద్యమ పితామహుడు, సంఘ సంస్కర్త, దళిత వైతాళికుడు , సమాజంలో దళితుల చైతన్యం కోసం విశేష కృషి చేసిన మహనీయుడని  కొనియాడారు.

దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఉద్యమించిన మహనీయుల చరిత్రను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, మహానుభావులు ఆచరించి చూపిన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, మాజీ జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్ నార్ రమేష్ ,ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రేగుంట కేశవరావు, సంబంధిత శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దళితుల అభ్యున్నతికి విశేష కృషి: కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మే 22 (విజయక్రాంతి) : దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమానికి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సం చాలకులు పోటు రవీందర్ రెడ్డి, షెడ్యూల్ కులాల సహకార సంస్థ ఈ.డి. చాతరాజుల దుర్గాప్రసాద్, అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమా ల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం భాగ్యరెడ్డి వర్మ విశేష కృషి చేశారని అన్నారు. బాల్య వివాహాలు, అంటరానిత నం, దేవదాసి, జోగిని వ్యవస్థలను రూపుమాపేందుకు పోరాటం చేశారని తెలిపారు.

దళిత ఉద్యమ పితామహుడుగా, సంఘసంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, సమాజంలో దళితుల చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించారని తెలిపారు. దేశ భవిష్యత్తు, ప్రజల సం క్షేమం కోసం మహనీయులు ఆచరించిన మార్గాలను భావితరాలకు అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.