calender_icon.png 5 November, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ వందేళ్ల ఉద్యమ చరిత్రను ప్రజలకు వివరించాలి

04-11-2025 12:00:00 AM

కరీంనగర్, నవంబరు 3 (విజయ క్రాంతి): సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఊరురా, వాడ వాడన సిపిఐ జెండాలు ఎగురవేస్తూ, పార్టీ నిర్వహించిన ప్రజోద్యమాలను యా వన్మంది ప్రజానీకానికి వివరించాల్సిన అవశ్యకత నాయకత్వంపై ఉందని సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

సోమవారం సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యుల సమావేశం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న భారత దేశంలో ఆవిర్భవించిన సిపిఐ వచ్చే డిసెంబర్ 26నాటికి వందేళ్లు నిండుతాయని, ఆ సందర్భంగా సిపిఐ నిర్వహించిన ఉద్యమ ఘట్టాలను, విజయాలను, మహోజ్వల చరిత్రను నేటితరానికి, ప్రతి గడపగడపకు వెళ్ళి తెలియజేయాలని అన్నారు.

ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, తదితరులుపాల్గొన్నారు.