calender_icon.png 1 September, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌ను బద్నాం చేయనికే సభ

01-09-2025 02:11:32 AM

  1. కాళేశ్వరంపై చర్చకు మేం సిద్ధం

పీపీటీకి అవకాశం ఇవ్వండి

సెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ 

ఎమ్మెల్యే వివేకానంద్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడం కోసం, హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అసెంబ్లీని గాలికి వదిలి స్పెషల్ ఫ్లుటైలో కేరళకు పరుగుపెట్టారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కేపీ వివేకానంద్ ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై అత్యంత కీలకమైన చర్చ జరుగుతున్న రోజు, సీఎం సభకు గైర్హాజరు కావడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.

ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కేసీఆర్‌ను బద్నాం చేయడానికే అసెంబ్లీ సమావేశాలు పెట్టారని ఆరోపించారు. ‘ప్రభుత్వానికి చేసే పనిలో చిత్తశుద్ధి లేదు. ఆత్మస్తుతి, పరనింద కోసమే ఈ సభను నిర్వహిస్తున్నారు. రైతులు యూరియాతో అల్లాడుతున్నా, వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నా ప్రజా సమస్యలపై చర్చించేందుకు మేం సభ కు హాజరయ్యాం.

కానీ సీఎం మాత్రం గాలి మో టార్ ఎక్కి పుస్తకావిష్కరణకు వెళ్లారు’ అని ఆరోపించారు.  జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ కేవలం కాంగ్రెస్ పార్టీ వేసిన కమిషన్ అని వివేకానంద్ అభివర్ణించారు. ఒక వైపు కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే, మరోవైపు మాపై నిందలు వేసే ప్రయత్నం చేస్తు న్నారని మండిపడ్డారు. ‘హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత, సుమారు 665 పేజీల నివేదికను ఈరోజే మా చేతికిచ్చి, వెంటనే చర్చకు రమ్మంటున్నారు.

ఇంత పెద్ద నివేదికను చదువుకుని సమాధానం ఎలా చెప్పా లి? ఇది రాజకీయ నీతి అనిపించుకోదు’ అని తప్పుబట్టారు. ప్రభుత్వానికి సొంత పార్టీ నేతల సలహాలు తీసుకునే స్థితిలో కూడా లేదని, సీఎంకు కేవలం అధిష్ఠానమే ముఖ్యమని వివేకానంద్ విమర్శించారు. అధికార మదంతో తమకు తిరుగులేదన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలీ కనిపిస్తోందన్నారు.