22-09-2025 12:59:50 AM
-సూది మొనపై రూపొందించిన కళాకారుడు
-4మిల్లీ మీటర్లతో తయారీ
కోదాడ, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు బతుకమ్మ సంబురాల సందర్భంగా గుండు సూదిమొనపై నాలుగు మిల్లీ మీటర్ల గల బతుకమ్మను ఆదివారం తయారు చేశాడు. కాగా సైదులు తయారుచేసిన సూక్ష్మ బతుకమ్మను చూసి సూదిమొన పైన ఉయ్యాలో.. సూక్ష్మమైన బతుకమ్మ ఉయ్యాల.. అంటూ పాడడం మహిళల వంతైంది. సైదులు గతంలో కూడా పలు సూక్ష్మకళాఖండాలను తయారుచేసి అవార్డులు, ప్రశంసలు పొందాడు.